బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 అక్టోబరు 2018 (12:33 IST)

నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి 22 కేజీల బంగారు చీర.. ఎక్కడ?

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రూపాల్లో భక్తులు స్మరించుకుని పూజలు చేస్తున్నారు. తాజాగా దసరా వేడుకలు వైభవోపేతంగా జరిగే పశ్చిమబెంగాల్‌లో అమ్మవారి విగ్రహానికి 22 కేజీల బంగారంతో చీరను తయారు చేశారు. 
 
సాధారణంగా దసరా వచ్చిందంటే పశ్చిమబెంగాల్‌లో దుర్గామాత మండపాలను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కోల్‌కతాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఓవైపు లండన్‌ థీమ్‌తో మండపం ఏర్పాటు చేశారు. అలాగే అమ్మవారికి బంగారంతో తయారు చేసిన చీర అందరికీ ఆకట్టుకుంటోంది.
 
పూజా కమిటీ దుర్గామాత కోసం దాదాపు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్‌ ఈ చీరను డిజైన్‌ చేశారు. దాదాపు 50 మంది నిపుణులు ఈ చీర తయారీలో పాలుపంచుకున్నారు.