శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2023 (14:39 IST)

పాఠశాలలో ఉపాధ్యాయుల రొమాన్స్.. వీడియోలు వైరల్.. ఎక్కడ?

victim woman
పాఠశాల జీవితంలో మంచి నడవడికను పిల్లలకు అలవరచాలి. స్కూల్ జర్నీలో మంచి నడవడికను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులదే ఎక్కువ. అయితే గత కొద్ది రోజులుగా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని చెడగొట్టే అనేక సంఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 
 
బీడ్ జిల్లాలో ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెచ్చే ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
 బీడ్ జిల్లాలోని ఓ పాఠశాలలో టీచర్లు రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డారు.
 
పాఠశాలలో పలు చోట్ల ఇలాంటి పనులు చేసి ఆ తతంగాన్ని వీడియోలను రికార్డు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వ్యవహారం పాఠశాల యాజమాన్యం దృష్టికి వెళ్లింది. 
 
 
 
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిప్‌పై పాఠశాల ప్రిన్సిపాల్ డిసెంబర్ 9న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న స్కూల్ యాజమాన్యం ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసింది.