గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (17:43 IST)

నాకు మూడు నెలలుగా తిండి పెట్టట్లేదు.. వంటింట్లోకి కూడా రానీయలేదు..

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడికి కొత్త చిక్కు వచ్చి పడింది. లాలూ ప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ సతీమణి ఐశ్వర్యా రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసాభారతి మీద ఆమె ఆరోపణలు చేశారు. తనకు మూడు నెలలుగా తిండి పెట్టడం లేదని, వంటింట్లోకి కూడా రానీయడం లేదన్నారు.
 
ఆరు నెలల కిందట ఆమెతో విడాకులు కోరుతూ తేజ్‌ ప్రతాప్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయినా ఆమె తన బంధం నిలుస్తుందనే భావనతో ఆమె రబ్రీ దేవి నివాసంలోనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. అత్తారింటికి వేధింపులపై నోరు విప్పారు. 
 
తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమె మహిళా హెల్ప్​ లైన్​కు ఫోన్​ చేయడంతో పోలీసులు రంగంలోకిదిగారు. తండ్రి చంద్రికా రాయ్​తో కలిసి లాలూ అవుట్ హౌస్ లో ధర్నాకు దిగింది. అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతికి తానంటే మొదటి నుంచీ ఇష్టం లేదని, ఇంత పెద్ద ఇంట్లో మూడు నెలలుగా తనకు తిండి పెట్టట్లేదని చెప్పారు.
 
కిచెన్​ తాళాలు వేసుకుని, కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదని ఆమె పేర్కొంది. తన ఇంట్లో తన పరిస్థితిపై వీడియో తీస్తుంటే రబ్రీదేవి బాడీ గార్డొచ్చి మొబైల్ లాక్కొనే ప్రయత్నం చేశాడని ఐశ్వర్యా చెప్పింది.