సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (10:48 IST)

మృతి చెందిన కుమారుడు.. కోడలికి రెండోళ్లి చేసిన మామ

daughter in law remarriage
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడు చేసిన పనిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. తన కుమారుడు అకాల మరణం చెందడంతో వితంతువైన తన కోడలికి రెండో పెళ్లి చేశారు. తన కొడుకు అనారోగ్యంతో చనిపోగా ఒంటరి జీవితం సాగిస్తున్న కోడలికి తండ్రి స్థానంలో నిలిచి మరో వ్యక్తితో వివాహం జరిపించారు. 
 
ధమ్‍తరీకి చెందిన మాజీ ఎంపీ చందూలాల్ సాహు చేసిన ఈ పనిని ప్రతి ఒక్కరూ వేనోళ్ళ ప్రశంసిస్తున్నారు. ఈయన పదేళ్ల క్రితం తన కుమారుడు కళ్యాణి సాహుకు పెళ్లి చేశారు. ఆ తర్వాత నాలుగేళ్ళకు చందూలాల్ తనయుడు అనారోగ్యంతో మరణించడంతో యేడాదిన్నర వయస్సున్న కుమారుడితో తన కోడలు ఒంటరిగా జీవిస్తుంది. 
 
ఆమెను చూసి మనస్సు చలించిపోయిన చందూలాల్‌కు రెండో వివాహం చేసేందుకు తగిన వరుడుని స్వయంగా వెతికారు. ధమ్‍తరీకి చెందిన డాక్టర్ వీరేంద్ర గంజీర్ గురించి ఆయనకు తెలిసింది. వీరేంద్రకు కూడా గతంలో పెళ్లి కాగా ఆయన భార్య కూడా గుండెపోటుతో చనిపోయింది.
 
అప్పటి నుంచి ఆయన తన కుమార్తెతో ఒంటరిగా జీవిస్తున్నాడు. వారిద్దరి అసంపూర్ణ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఇరు కుటుంబాల సభ్యులు వారికి వివాహం చేయించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఈ వివాహం ధమ్‌తరీ వింధ్యావాసిని ఆలయంలో జరిగింది.