అలోక్ వర్మ సంచలన నిర్ణయం.. ఏం చేశారంటే?

alok varma
Last Updated: శుక్రవారం, 11 జనవరి 2019 (17:14 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన హైపవర్ కమిటీ గురువారం సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలోక్ వర్మ శుక్రవారం తన సేవలకు రాజీనామా చేశారు. అలోక్ వర్మను ప్రభుత్వం అగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. 
 
కానీ ఆ పదవిని చేపట్టేందుకు అలోక్ వర్మ నిరాకరించారు. అంతేగాకుండా.. ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. తాను ఎలాంటి తప్పులు చేయకపోయినా.. ఎవరో చేసిన ఆరోపణలకు తాను బలైపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికి 2 సార్లు అలోక్ వర్మను పదవినుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31న  అలోక్ వర్మ పదవీ విరమణ చేయనున్నారు. దీనిపై మరింత చదవండి :