ఛత్తీస్‌ఘడ్‌లో ఇద్దరు జర్నలిస్టుల ఆత్మహత్య.. కారణం ఏమై వుంటుంది?
జమ్మూ-కాశ్మీర్‌లో ప్రముఖ జర్నలిస్టు, రైజింగ్ కశ్మీర్ ప్రధాన షుజాత్ బుఖారీని, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని పత్రిక కార్యాలయం వెలుపలనే గురువారం జ
జమ్మూ-కాశ్మీర్‌లో ప్రముఖ జర్నలిస్టు, రైజింగ్ కశ్మీర్ ప్రధాన షుజాత్ బుఖారీని, ఆయన వ్యక్తిగత అంగరక్షకుడిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపారు. ఈ ఘటన శ్రీనగర్‌లోని పత్రిక కార్యాలయం వెలుపలనే గురువారం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
50 ఏళ్లు ఉన్న బుఖారీ స్థానిక ప్రెస్ ఎన్‌క్లేవ్‌లోని పత్రికా కార్యాలయం నుంచి వెళ్లిపోతున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. నగరం మధ్యలో ఉండే లాల్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇద్దరు యువ జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్ పూర్‌లో కలకలం రేపింది. ''పత్రిక'' పేరిట నడుస్తున్న దినపత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న రేణు అవస్థి (21) అనే యువతి, ఐఎన్ఎస్ న్యూస్ చానల్‌లో రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్న శైలేంద్ర వి సుఖర్మ (34) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరి ఆత్మహత్యకు గల కారణం ఏమిటనే దానిపై విచారణ జరుపుతున్నారు. వీరిద్దరి ఆత్మహత్యలకూ ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు.