మసాజ్ చేస్తానంటూ వచ్చిన అందమైన అమ్మాయి.. ఏం చేసిందంటే?
చెన్నై తేనాంపేటలోని ఓ పారిశ్రామిక వేత్త సతీమణికి మసాజ్ చేసిన అందమైన యువతి అదృశ్యమైంది. ఆ యువతి అదృశ్యం వెనుక పెద్ద కథే వున్నట్లు తెలుస్తోంది. మసాజ్ కంటూ వచ్చి.. రూ.7లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. తేనాంపేటలోని పారిశ్రామిక వేత్త దినేష్ కుమార్ డాల్మియా సతీమణి రాధా డాల్మియాకు మసాజ్ చేసేందుకు స్పా నుంచి ఓ అందమైన యువతి మసాజ్ చేసేందుకు వచ్చేది.
సౌమ్య అనే ఆ యువతి రోజూ ఇంటికి వచ్చి మరీ రాధా డాల్మియాకు మసాజ్ చేస్తుంది. ఇదే తరహాలో గురువారం మసాజ్ చేసేందుకు వచ్చిన సౌమ్య.. రాధా డాల్మియా కన్నుగప్పి.. రూ.7లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో పారిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై రాధా డాల్మియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.