Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య రెండో పెళ్లి చేసుకుంది.. బిడ్డను చూడనివ్వట్లేదని..?

బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:59 IST)

Widgets Magazine

భార్య నుంచి ఓ భోజ్ పురి నటుడు విడిపోయాడు. ప్రియురాలితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే భార్యకు గుణపాఠం చెప్పాలనుకుని.. ప్రియురాలితో కలిసి తన బిడ్డనే కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లో భోజ్ పురి చిత్రాల్లో నటించే ముహమ్మద్ షాహిద్ (23)కు ముస్కాన్ అనే భార్య వుంది.

వీరికి షహనాజ్ అనే రెండేళ్ల కుమారుడు వున్నాడు. అయితే షాహిద్, ముస్కాన్‌తో ఏర్పడిన వివాదాలు విడాకులకు దారితీసింది. ముస్కార్ రెండో వివాహం చేసుకుంది. షాహిద్ కూడా సునయన శర్మ అలియాస్ అలీషా అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు.
 
కోర్టు ఆదేశాల మేరకు షెహనాజ్ తల్లి సంరక్షణలో ఉన్నాడు. అతనిని చూసేందుకు షాహిద్‌కు అనుమతి కూడా వుంది. కానీ కుమారుడిని చూసేందుకు షాహిద్‌ను ముస్కాన్ అనుమతించడం లేదు. దీంతో కోపంతో రగిలిపోయిన షాహిద్ తన మాజీ భార్యకు బాగా బుద్ధి చెప్పాలనుకున్నాడు. అంతే తన ప్రియురాలితో కలిసి ఓ ప్లాన్ వేశాడు.

తన కుమారుడిని కిడ్నాప్ చేశాడు. ఆపై తన మాజీ భార్య నిర్లక్ష్యం వల్లే కొడుకు కిడ్నాప్‌కు గురయ్యాడని కేసు పెట్టాడు. పోలీసులు విచారణ చేపట్టారు. కానీ అప్పుడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కిడ్నాపైన బాలుడు షాహిద్ ఇంట్లోనే ఉన్నాడని తేలింది. దీంతో షాహిద్‌తో పాటు అతని ప్రియురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ట్రాక్టర్‌పై రంగు చెడిపేశాడనీ...

పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌ సమీపంలో ఓ దారుణం జరిగింది. ట్రాక్టర్‌పై ఉన్న రంగును చెడిపేశాడని ...

news

డేరా బాబా ఆశ్రమంలోని టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలు

సిర్సాలోని డేరా బాబా ఆశ్రమంలో ఉన్న టాయిలెట్లలో కూడా సీసీటీవీ కెమెరాలను అమర్చిన విషయం ...

news

రాందేవ్ ఓ దొంగ బాబా.. కాషాయం ధరించి వ్యాపారాలు చేసుకోవచ్చా?: డిగ్గీ రాజా

యోగా గురు బాబా రాందేవ్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో ...

news

జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర... సీన్లోకి ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు క్లాస్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. వైసీపీ ...

Widgets Magazine