డాక్టర్‌తో భార్యకు లింక్ అని అనుమానం... చెప్పిందని ముక్కలుగా నరికేశాడు...

crime
కుమార్ దళవాయి| Last Modified బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (11:48 IST)
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు చెందిన ఓ ఆర్థోపెడిక్ డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు. తన వద్దే 30 ఏళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తిని చంపి ముక్కలు ముక్కలుగా కోసి ఆ భాగాలను యాసిడ్‌లో వేసాడు.

వివరాల్లోకి వెళితే, భోపాల్‌కు చెందిన 56 ఏళ్ల ఆర్థోపెడిక్ డాక్టర్ సునీల్ మంత్రి భార్య ఇంటిలోనే ఒక బొటిక్ నిర్వహిస్తూ ఉండేది. ఈమధ్యే ఆమె చనిపోవడంతో బొటిక్‌ను నిర్వహించలేక ఆ డాక్టర్ దాన్ని తన డ్రైవర్ భార్యకు ఇచ్చేసాడు. అయితే బొటిక్ ఇచ్చినందుకు అభిమానంతో ఆమె ఆ డాక్టర్‌తో తరచుగా మాట్లాడేది. ఇది చూసి అనుమానం పెంచుకున్న ఆమె భర్త డాక్టర్‌తో సంబంధం అంటగడుతూ రోజూ ఆమెను వేధించేవాడు. ఈ వేధింపులు భరించలేక ఒక రోజు ఆమె ఆ విషయాన్ని డాక్టర్‌కు చెప్పుకుని ఏడ్చేసింది.

అయితే డ్రైవర్‌ను మందలించడమో లేక అతనికి సర్ది చెప్పడమో చేయాల్సిన ఆ డాక్టర్ డ్రైవర్‌ను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతను ఒక డ్రమ్ము నిండా యాసిడ్‌ను, పదునైన రంపాలను తెప్పించుకున్నాడు. అయితే ఈ విషయం డ్రైవర్‌కు కానీ, అతని భార్యకు కానీ తెలియదు.

ఈమధ్యే డ్రైవర్ బీరేంద్ర పంటినొప్పిగా ఉంది అనటంతో, ఇదే సరైన సమయంగా భావించిన డాక్టర్ నేను చూస్తానని చెప్పి అతన్ని బెడ్‌పై పడుకోబెట్టి, ఆపరేషన్ చేసే కత్తితో డ్రైవర్ గొంతు కోసేసాడు. కొద్దిసేపటికే డ్రైవర్ చనిపోవడంతో శవాన్ని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే సిద్ధంగా ఉంచిన రంపాలతో శరీరాన్ని ముక్కలుగా కోసి, యాసిడ్ ఉన్న డ్రమ్ములో వేసి మూత పెట్టాడు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకువెళ్లేటప్పుడు రక్తం కారడంతో ఆ వాసనకు చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసారు. అక్కడికి వచ్చిన పోలీసులు డాక్టర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.దీనిపై మరింత చదవండి :