Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మధ్యప్రదేశ్... అమెరికా కన్నా బెటరట... హ్హ.. హ్హ.. హ్హ...

శనివారం, 4 నవంబరు 2017 (12:14 IST)

Widgets Magazine
netizens

మధ్యప్రదేశ్ రాష్ట్రం అమెరికా కంటే బెటరట అంటూ గతంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తమకు తోచినరీతిలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 'మధ్యప్రదేశ్... అమెరికా కన్నా బెటరట... హ్హ.. హ్హ.. హ్హ...' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే... 'భోపాల్ రేప్ క్యాపిటల్. అయితే ఇక్కడి నేతలు దీనిని యుఎస్‌తో పోలుస్తుంటారు. అంటే ఇక్కడివారంతా రంగుటద్దాలు పెట్టుకుని తిరుగుతుంటారనా'? అంటూ ట్వీట్ చేశారు.
 
గత గురువారం ఆ రాష్ట్ర రాజధాని భోపాల్ నడిబొడ్డున ఐఏఎస్ శిక్షణ తీసుకునే ఓ 19 యేళ్ళ విద్యార్థినిపై నలుగురు కామాంధులు మధ్యమధ్యలో విరామం తీసుకుంటూ మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. 
 
ఈ ఘటనపై సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమ ట్వీట్లు, ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా పలువురు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ, పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఏమంటున్నారంటే..
 
మహిళల రక్షణ మన ప్రథమ కర్తవ్యం. ఇది హక్కు. డిమాండ్ కాదు అని అంటే, ఎంపీ సీఎం శివరాజ్ ఆమధ్య మాట్లాడుతూ మధ్యప్రదేశ్.. మహిళలకు అమెరికాకన్నా సురక్షితమైనదన్నారు. అంటే ఇదేనా? అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. మధ్యప్రదేశ్‌లో ఎటువంటి భద్రత లేదని ఇప్పడు తేలిపోయిందని ఇంకో నెటిజన్ ట్వీట్ చేశాడు. వాషింగ్టన్ కన్నా భోపాల్ బెటరా? ఇక్కడి రోడ్లు అమెరికా కన్నా బాగానే ఉన్నాయి. కానీ న్యాయం గురించి ఏమంటావు మామా? అంటూ మరో యువకుడు ప్రశ్నించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ పాదయాత్ర.. చంద్రన్న సర్కారు ఉలికిపాటు... ఎందుకు?

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పాదయాత్ర దెబ్బకు ...

news

భోపాల్ నడిబొడ్డున విద్యార్థిని గ్యాంగ్‌ రేప్‌... విరామం తీసుకుంటూ మరీ....

మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరం నడిబొడ్డున ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటున్న ...

news

#ChennaiRains : మరో 24 గంటలు వర్షాలే... భయం గుప్పిట్లో జనం చెన్నైవాసులు

గత నెల 27వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత ఐదు రోజులుగా ...

news

హిందూ ఉగ్రవాదం కామెంట్స్.. కమల్ హాసన్‌పై కేసులు... అరెస్టు ఖాయమా?

ఈనెల ఏడో తేదీన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న విశ్వనటుడు కమల్ హాసన్ చిక్కుల్లో ...

Widgets Magazine