శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 29 డిశెంబరు 2018 (11:43 IST)

భార్య బండారాన్ని భర్త అలా బయటపెట్టాడు..

వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియాల ప్రభావంతో అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. వివాహేతర సంబంధాలతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా తనను మోసం చేసి.. మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు భర్త షాక్ ఇచ్చాడు. 
 
ఈ ఘటన బీహార్‌లోని గోపాల్ గంజ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహారాదేవుర్ గ్రామానికి చెందిన ఓ యువతికి 2018లో బగ్హవా గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. భర్త, ఇతర కుటుంబ సభ్యులు ప్రతిరోజూ పొలం పనుల మీద వెళ్లిపోయేవారు. 
 
ఒకరోజు భర్త మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో భార్య వేరొక వ్యక్తితో అభ్యంతరకర స్థితిలో ఉండటాన్ని చూశాడు. దీంతో ఇంటి తలుపులు బయటినుంచి వేసి, చుట్టుపక్కలవారిని పిలిపించి ఈ విషయం చెప్పాడు. అందరూ ఆ యువకుడిని ప్రశ్నించగా.. తాము ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నామని తెలిపాడు. ఈ వ్యవహారంపై పోలీసులు రంగంలోకి విచారణ జరుపుతున్నారు.