సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (10:01 IST)

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం : బీజేపీ ఎమ్మెల్యే లోకేంద్ర మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నూర్ జిల్లా సితార్‌ పూర్‌ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ కన్నుమూశారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని  బిజ్నూర్ జిల్లా సితార్‌ పూర్‌ సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే లోకేంద్ర సింగ్ కన్నుమూశారు. 
 
ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొనగా, ప్రమాదంలో లోకేంద్రతో పాటు.. ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది అయిన ఇద్దరు గన్‌మెన్లు కూడా మృతిచెందారు. కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నా, అవి వారి ప్రాణాలను కాపాడలేకపోయాయి. 
 
ప్రమాదం జరిగిన సమయంలో రెండు వాహనాలు అతి వేగంతోనే ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని లోకేంద్ర, ఆయన గన్‌‌మెన్ల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.