Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జీవించాలా? లేక మరణించాలా? రాష్ట్రపతే తేల్చాలి : ట్రాన్స్‌వుమన్

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (11:43 IST)

Widgets Magazine
shanvi ponnuswamy

తాను జీవించాలా? మరణించాలా? అనే విషయాన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవిందే తేల్చాలంటూ ట్రాన్స్‌వుమెన్ షన్వి పొన్నుస్వామి అంటోంది. ఇంజనీరు, మోడల్, నటిగానే కాక ఓ జాతీయ స్థాయి ఎయిర్‌లైన్ సంస్థలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా షన్వి... లింగమార్పిడి చేయించుకున్న కారణంగా ఎయిరిండియా విమానయాన సంస్థ తనకు ఉద్యోగాన్ని నిరాకరించిందని, ప్రస్తుతం తనకు బతుకు భారమైందని, కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఆమె రెండ్రోజుల కిందట రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 
 
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం కోసం షన్వి మూడేళ్ల కిందట లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంది. ఎయిరిండియాలో ఉద్యోగానికి అన్ని పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధించినా జెండర్ కారణంగా తనను ఎంపిక చేయలేదని ఆమె పేర్కొంది. ఇదే విషయమై ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. ఆయితే కోర్టు ఖర్చులు భరించలేకపోతున్నానని, తిండికి  కూడా డబ్బులు లేక తిప్పలు పడుతున్నానని, కారుణ్య మరణానికి తనకు అవకాశమివ్వాలని కోరుతూ ఆమె రాష్ట్రపతికి లేఖ రాసింది. దీనిపై రాష్ట్రపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచూచూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ట్రాన్స్ ఉమెన్ రాంనాథ్ కోవింద్ కారుణ్య మరణం Transwoman Mercy Killing Tamil Nadu President Ram Nath Kovind

Loading comments ...

తెలుగు వార్తలు

news

కలెక్టర్ అమ్రపాలి హనీమూన్ ఎక్కడో తెలుసా?

వరంగల్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాటా వివాహం ఈనెల 18వ తేదీన జరుగనుంది. ఢిల్లీకి చెందిన ...

news

టీడీపీ కేంద్ర మంత్రులకు సిగ్గేలేదు... వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య

'తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు ఏమాత్రం సిగ్గూశరం లేదు. వారికి వెన్నుపోటు ...

news

అవినీతి ఆరోపణలు .. దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి రాజీనామా

అవినీతి ఆరోపణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవికి జాకబ్ జుమా రాజీనామా చేశారు. ఈయన ...

news

పవన్ డెడ్‌లైన్‌ను పట్టించుకోని టీడీపీ - ఇక వార్ వన్‌సైడేనా?

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను బహిర్గతం చేయాలంటూ జనసేన ...

Widgets Magazine