Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఢిల్లీలో సంచలనం : 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఆదివారం, 21 జనవరి 2018 (16:46 IST)

Widgets Magazine
kejriwal

దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగినందుకు ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదించారు. 
 
20 మంది ఆప్ ఎమ్మెల్యేల అనర్హతపై ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఈ 20 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు. కాగా, ఈ 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని, వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజుల క్రితం సిఫారసు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఎన్నికల కమిషన్ సిఫారసు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ తమ ఎమ్మెల్యేల వాదనను వినకుండానే ఇటువంటి చర్య తీసుకున్నారని ఆరోపించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్యోతి నిర్ణయం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించింది. రాష్ట్రపతి తమ ఎమ్మెల్యేల వాదనను వినాలని కోరింది. కానీ చివరికి రాష్ట్రపతి కూడా ఎన్నికల సంఘం సిఫారసులను ఆమోదించడంతో ఆప్ 20 మంది ఎమ్మెల్యేలను కోల్పోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గవర్నర్‌కు తెరాస సభ్యత్వం ఇవ్వొచ్చు.. నరసింహన్‌కు భజన శాఖ కేటాయించండి

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌పై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ...

news

తెరాస సర్కారుకు గవర్నర్ చెక్కభజన చేస్తున్నారు : వీహెచ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ...

news

చదువుల్లో రాణించివుంటే ప్రొఫెసర్ అయివుండేవాడిని : పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ...

news

సిమెంట్ రోడ్లతో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయ్ : చంద్రబాబు

గ్రామీణ ప్రాంతాల్లో బురద అవుతోందని సిమెంట్ రోడ్లు నిర్మిస్తుంటే మోకాళ్ల నొప్పులు ...

Widgets Magazine