Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జాతీయ పార్టీలకు తమిళనాడులో స్థానంలేదు : డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (08:57 IST)

Widgets Magazine
panneerselvam

తమిళనాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత ఓ.పన్నీర్ సెల్వం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. తన రాజకీయ భవితవ్యాన్ని కాపాడుకునేందుకు నిన్నటివరకు బీజేపీ జాతీయ నేతలతో అంటకాగిన పన్నీర్ ఇపుడు రివర్స్ గేర్ వేశారు. 
 
'తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేదు. 1967 నుంచీ రాష్ట్రంలో ద్రవిడ పార్టీలే అధికారంలో ఉన్నాయి. వంతులవారీగా తమిళనాడును ఏలుతున్నాయి. జాతీయ పార్టీలు నిలదొక్కుకోలేకపోయాయి. ఆ పార్టీలను ప్రజలు అంగీకరించరంటూ వ్యాఖ్యలు చేసి బీజేపీ నేతలకు తేరుకోలేని షాకిచ్చారు. 
 
ఎందుకంటే, వచ్చే యేడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. నిజానికి తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకీ ఏమాత్రం పట్టులేదు. ఇటీవల జరిగిన చెన్నై, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో కూడా నోటా గుర్తు కంటే బీజేపీకి తక్కువ ఓట్లు పోలైన విషయం తెల్సిందే. 
 
ఈనేపథ్యంలో బీజేపీతో కలిసి ముందుకు సాగితే తమ భవితవ్యం కూడా ప్రమాదంలో పడుతుందని భావించిన పన్నీర్ సెల్వం తమ రాష్ట్రంలో జాతీయ పార్టీలకు స్థానం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఛాన్సిస్తామనీ టీవీ నటిని వ్యభిచారం రొంపిలోకి దించారు...

సినీ మోజులో పడి అనేక మంది అమ్మాయిలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా, ...

news

మూడు నగరాల్లో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాలు... యనమల

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో భారీ స్థాయి కుటుంబ వినోద కేంద్రాల(ఎఫ్ఈసీ-ఫ్యామిలీ ఎంటర్ ...

news

ఏపీ సచివాలయంలో జర్మనీ స్మార్ట్ సైకిళ్లు, బైకులు

అమరావతి: విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో కూడా స్మార్ట్ బైకులు ప్రవేశపెట్టాలని ఆలిండియా ...

news

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం: సూపర్ బ్లూ బడ్ మూన్‌గా చంద్రుడు(Video)

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకన్న ఆలయంతో పాటు అన్నీ ...

Widgets Magazine