Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బ్లూవేల్ గేమ్‌ ఎఫెక్ట్: బాంబు బూచి.. పోలీసులకు చుక్కలు చూపించిన ఎంసీఎ విద్యార్థి

బుధవారం, 27 డిశెంబరు 2017 (16:32 IST)

Widgets Magazine
blue whale challege

బ్లూవేల్ గేమ్‌ మృత్యుక్రీడగా మారింది. ఈ క్రీడపై నిషేధం విధించాలని డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పటికే పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు ఈ గేమ్‌పై కన్నెర్ర చేసింది. బ్లూవేల్ ఛాలెంజ్ గేమ్‌పై స్టే ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.
 
ఇటీవల ఈ గేమ్ ఆడుతూ ముంబై, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ ఆన్‌లైన్ గేమ్‌ పరిణామాలపై దృష్టి సారించింది. ఈ గేమ్‌కు సంబంధించిన లింక్‌లు తొలగించాలంటూ గూగుల్, ఫే‌స్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం, మైక్రోసాఫ్ట్, యాహూ వంటి సోషల్ మీడియా దిగ్గజాలను ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
 
అయితే తాజాగా బ్లూవేల్ ఆన్‌లైన్‌ గేమ్ భూతం బారిన మ‌రో యువ‌కుడు ప‌డ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎంసీఏ విద్యార్థి సందీప్‌కుమార్ (21) బ్లూవేల్ గేమ్ ఆడుతూ అందులో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండిలోని అంతర్రాష్ట్ర ప్రయాణ ప్రాంగణంలో బాంబు ఉందని పోలీసులకు చుక్కలు చూపించాడు. పోలీసులకు ఫోన్ చేసి బాంబు వుందని చెప్పడంతో వారు పరుగులు తీసేలా చేశాడు. 
 
చివ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చి పోలీసులకు లొంగిపోయాడు. బ్లూవేల్‌లో క్రీడలో భాగంగా అలా చేయ‌మ‌న్నార‌ని.. అందుకే అలా చేశానని క్లారిటీ ఇచ్చాడు. గతంలో కూడా బ్లూవేల్‌లో భాగంగా త‌న బైక్‌ని అతి వేగంగా నడిపి ఆత్మహత్యాయ‌త్నం చేశాన‌ని తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

#ChappalChorPakistan : ట్విట్టర్‌లో ట్రెండ్

ఇపుడు 'చెప్పల్ చోర్ పాకిస్థాన్' అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ...

news

జస్ట్ ఒక్క ఏడాది ఆగండి... జగనన్న వచ్చేస్తాడు...(వీడియో)

నగరి ఎమ్మెల్యే రోజా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూనే ...

news

చనిపోతూ కూడా సహచరులకు దిశానిర్దేశం చేసిన మేజర్ ప్రఫుల్ (వీడియో వైరల్)

ఇటీవల జమ్మూ-కాశ్మీరులోని కేరి సమీపంలో పాకిస్థాన్ సైన్యం ఎటువంటి హెచ్చరికలు లేకుండా ...

news

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక ...

Widgets Magazine