శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 1 మార్చి 2018 (11:15 IST)

భానుడి తాపం తగ్గదండోయ్.. జాగ్రత్తగా వుండాల్సిందే.. తెలంగాణలో?

వేసవి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం భానుడి తాపం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత పెరగనుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న

వేసవి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం భానుడి తాపం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత పెరగనుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే దేశ వ్యాప్తంగా కనీసం ఒక డిగ్రీ వరకు వేడి పెరుగుతుందని భారత వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
 
ఇప్పటికే ఉత్తరాదిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల వరకు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2.3 డిగ్రీల అధిక వేడి నమోదవుతుందని అధికారులు చెప్పారు. 
 
మార్చి నుంచే ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుతుందని.. ఈ సమయంలో ప్రమాదకరమైన వేడి గాలులు వీస్తాయని హెచ్చరించారు. తెలంగాణలో అధిక వేడి నమోదవుతుందని.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాయల సీమల్లో ఉష్ణోగ్రతలు నామమాత్రంగా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.