శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (15:51 IST)

మాపై దాడి చేయమని మాటిస్తే వస్తాం : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సీఎస్ లేఖ

ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆ రాష్ట్ర అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ దాడి సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగింది.

ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌పై ఆ రాష్ట్ర అధికార పార్టీ ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ దాడి సాక్షాత్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి, ఈ దాడితో సంబంధం ఉన్న ఆప్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో వచ్చే నెలాఖరులోగా ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇందుకోసం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆయన మరోసారి సమావేశం కావాల్సి ఉంది. బడ్జెట్ సమావేశాలపై చర్చించాల్సి ఉంది. అయితే తనతోపాటు ఇతర అధికారులపై చేయి చేసుకోమని హామీ ఇస్తేనే వస్తామని సీఎంకు అన్షు ప్రకాశ్ ఓ లేఖ రాశారు. ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశ తేదీలను ఖరారు చేయడానికి ఈ భేటీ నిర్వహించాలనుకుంటున్నట్లు లేఖలో సీఎస్ ప్రస్తావించారు. 
 
ఈ లేఖలో 'ఢిల్లీ ఉద్యోగులు కష్టపడి పనిచేస్తున్నారు. ప్రభుత్వ పాలన సజావుగా సాగాలని కోరుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాలతోనే అది సాధ్యం. అందుకే దానికి సంబంధించిన తేదీలు ఫైనల్ చేయడానికి నేను, మా ఇతర అధికారులు సమావేశానికి వస్తున్నాం. అయితే మాపై ఎలాంటి దాడి జరగదని సీఎం హామీ ఇస్తేనే వస్తాం' అంటూ సీఎస్ ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.