శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 21 జూన్ 2018 (11:05 IST)

పెళ్లిచూపుల్లో చూసిన వ్యక్తి ఇతను కాదు.. దండలు మార్చుకునే సమయంలో?

పెళ్లిచూపుల్లో చూసింది ఒకరిని... వివాహ మండపంలో వున్నది వేరొకడని.. ఓ వధువు హంగామా చేసింది. పెళ్లిచూపుల సమయంలో తనకు చూపించిన యువకుడు, కల్యాణ మండపంపైకి వచ్చిన యువకుడు వేర్వేరు వ్యక్తులని.. ఇద్దరూ ఒకరు కా

పెళ్లిచూపుల్లో చూసింది ఒకరిని... వివాహ మండపంలో వున్నది వేరొకడని.. ఓ వధువు హంగామా చేసింది. పెళ్లిచూపుల సమయంలో తనకు చూపించిన యువకుడు, కల్యాణ మండపంపైకి వచ్చిన యువకుడు వేర్వేరు వ్యక్తులని.. ఇద్దరూ ఒకరు కాదని షాకిచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురిలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఔఛా ప్రాంతానికి చెందిన రాజేష్ గుప్తా కుమారుడు అభిషేక్ గుప్తాకు, ఫిరోజాబాద్‌కు చెందిన రాజ్ కుమార్ గుప్తా కుమార్తె తృప్తీ గుప్తాకు వివాహం నిశ్చయమైంది. ఔఛాలో ఈ పెళ్లిని ఘనంగా చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ వధూవరులిద్దరినీ మండపంపైకి తీసుకువచ్చిన కాసేపట్లోనే.. దండలు మార్చుకునే సమయంలో పెళ్లి కుమార్తెకు అనుమానం వచ్చింది. తనకు ఈ పెళ్లి వద్దని, తనను మోసం చేస్తున్నారని ఆరోపించింది. 
 
చూపుల్లో చూసిన వరుడికి.. మండపంలో దండలు మార్చుకునే వ్యక్తికి తేడా వుందని వధువు తెలిపింది. బలవంతంగా పెళ్లి చేస్తే చనిపోతానే తప్ప, కాపురం మాత్రం చేయలేనని మొండికేసింది. పెళ్లి చూపుల్లో చూసిన యువకుడు ఇతను కాదని చెప్పింది. ఇక చేసేదేమీ లేక వివాహాన్ని రద్దు చేసుకుని, వరుడి తల్లిదండ్రులు మండపం నుంచి తీసుకెళ్లిపోయారు.