శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (06:29 IST)

భారత్‌లో బుల్లెట్ రైలు... 14న శంకుస్థాపన

భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నా

భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లనుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. 
 
కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబరు 14వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా పాల్గొననున్నారు. సుమారు రూ.98,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్‌ రుణంగా సమకూర్చనుంది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సెప్టెంబర్‌ 13న గుజరాత్‌కు మోడీ, అబేలు చేరుకుంటారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.