మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (15:20 IST)

తమిళనాట భారీ ప్రమాదం...40 మందితో కొండపై నుంచి కింద పడిన బస్సు!

తమిళనాడులో 30 అడుగుల కొండపై నుంచి బస్సు కిందపడింది. ఈ ఘటనలో 40 మందికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే, చెన్నైకి 70కిలో మీటర్ల దూరంలోని తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుక

తమిళనాడులో 30 అడుగుల కొండపై నుంచి బస్సు కిందపడింది. ఈ ఘటనలో 40 మందికి తీవ్రగాయాలైనాయి. వివరాల్లోకి వెళితే, చెన్నైకి 70కిలో మీటర్ల దూరంలోని తిరుత్తణిలోని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకునేందుకు మదురై జిల్లాకు చెందిన 40 మంది భక్తులు బస్సులో వెళ్లారు. స్వామిని దర్శించుకున్న తర్వాత బస్సు కొండ దిగే క్రమంలో అతివేగం కారణంగా అదుపు తప్పింది. దీంతో 30 అడుగుల ఎత్తుపై నుంచి అది కింద పడిపోయింది. 
 
కానీ భక్తుల అదృష్టం కొద్దీ బస్సు ఎంత ఎత్తు నుంచి ఒక్కసారిగా కింద పడిపోకుండా ముందుగా ఓ వేపచెట్టుపై పడింది. ఆ తరువాత ముందు భాగం నేలను తాకింది. ఆ తరువాత నెమ్మదిగా కింద రోడ్డుపై వెళ్తున్న ఆటోపై నుంచి రోడ్డు మీద బస్సు వెల్లకిల పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది తలలకు తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. కింద ప్రయాణిస్తున్న ఆటోపై బస్సు పడడంతో ఆటో డ్రైవర్ మదన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.