మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Updated : గురువారం, 9 నవంబరు 2017 (13:55 IST)

తిరుమలకు వెళ్లివస్తూ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి(వీడియో)

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు.

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి రహదారిలోని ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద లారీ-కారును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు తమిళనాడు తిరుపూరుకు చెందినవారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా నెల్లూరు నుంచి తిరుపతి వైపు వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో వున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.