శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (13:17 IST)

డేరా బాబా కేసులో తీర్పు చెప్పిన జడ్జికి జడ్‌ప్లస్ సెక్యూరిటీ

ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్

ఆశ్రమంలోని సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు 20 యేళ్ళ జైలుశిక్ష పడింది. ఈ కేసులో తీర్పు చెప్పిన పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పేరు జగ్దీప్ సింగ్. ఈ కోర్టు తీర్పు అనంతరం ఆయనకు బెదిరింపులు రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి.
 
సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్‌కు ప్రభుత్వం జడ్‌ప్లస్ భద్రతను కల్పించింది. జడ్‌ప్లస్ సెక్యూరిటీలో భాగంగా మొత్తం 55 మంది పోలీసులు, 10 మంది ఎన్‌ఎస్‌జీ కమెండోలు న్యాయమూర్తితో పాటు ఆయన కుటుంబానికి భద్రత కల్పించనున్నారు. డేరా బాబా అనుచరులు చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడటంతో ప్రభుత్వం ఈ తరహా భద్రతను కల్పించింది.