సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 డిశెంబరు 2023 (09:55 IST)

ప్రబలుతున్న కరోనా కొత్త వేరియంట్... జేఎన్.1తో ముప్పు ఎంత?

corona visus
కరోనా కొత్త వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తుంది. ఫలితంగా దేశ వ్యాప్తంగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. కోవిడ్ జేఎన్.1 పేరుతో కొత్త వేరియంట్ ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య సాఖ సుధాంశ్ పంత్ సోమవారం అన్ని రాష్ట్రా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇటీవలకాలంలో కేరళలాంటి కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరిగాయని, ఇదేసమయంలో కొత్త వేరియంట్ ప్రభావం పెరిగిందని పేర్కొన్నారు. అందువల్ల అన్ని ప్రభుత్వాలు తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
 
కాగా, వచ్చే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని వైరస్ విస్తరించకుండా అడ్డుకోవడానికి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలి. శ్వాశకోశ సంబంధ పరిశుభ్రత పాటించేలా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు జారీ చేసిన కొవిడ్-19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలి. జిల్లాల వారీగా ఆసుపత్రులకు వచ్చే ఐఎస్ఐ (ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్నెస్), సారి (సీవియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇలెనెస్) రోగులను నిరంతరం పర్యవేక్షించాలి. 
 
కొవిడ్-19 పరీక్ష మార్గదర్శకాల ప్రకారం.. అన్ని జిల్లాల్లో తగిన పరీక్షలు నిర్వహించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన నిష్పత్తి ప్రకారం ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ టెస్టులు నిర్వహించాలి. ఆర్టీపీసీఆర్ టెస్టులు అధికంగా చేపట్టి పాజిటివ్ నమూనాలను జన్యు పరిణామ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్ లేబొరేటరీలకు పంపి కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించే ప్రయత్నం చేయాలి. కొవిడ్-19 నియంత్రణకు ఇదివరకటి మాదిరే సమాజ సహకారం కోరాలి. అందరూ దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించాలి.
 
జేఎన్.1 వేరియంట్ సోకిన వారిలో రోగ లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఇంకా పూర్తిగా తెలియదు. సాధారణంగా కొవిడ్-19 సోకినప్పుడు కనిపించే లక్షణాలే కనిపించొచ్చు. అయితే ఈ వేరియంట్ సోకినప్పుడు ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సంకేతం ఏమీలేదు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు పెరిగే ప్రమాదం ఉందన్న సంకేతం కూడా లేదు. ఇప్పుడున్న లేబొరేటరీల్లో ఆర్టీపీసీఆర్ టెస్టుల ద్వారా జేఎన్.1 వేరియంట్ను కనిపెట్టవచ్చు.