బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 జూన్ 2021 (18:19 IST)

చెన్నైలో దారుణం-డబ్బు కోసం కరోనా రోగిని హత్య చేసింది.. ఎవరు..?

corona patient murder
కరోనా రోగుల పట్ల వైద్యులు విశ్వప్రయత్నాలు చేసి కాపాడుతున్నారు. వారి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల కరోనా పేషెంట్లు నరకయాతన అనుభవిస్తున్నారు. చాలీచాలని వైద్య సదుపాయాలతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే దారుణం. కరోనా రోగుల పట్ల వైద్య సిబ్బంది నీచంగా ప్రవర్తిస్తున్నారు. 
 
అయితే చెన్నైలో ఓ రోగి హత్యకు గురైంది. డబ్బుల కోసం కరోనా రోగిని హతమార్చిన ఘటన చెన్నై ప్రభుత్వ ఆసుప్రతిలో చోటుచేసుకుంది. కరోనా సోకి చికిత్స పొందటానికి వచ్చిన ఓ రోగిని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉగ్యోగిగా పనిచేస్తున్న ఓ మహిళ చంపేసింది. కేవలం డబ్బుల కోసమే కరోనా రోగిని హత్య చేసినట్లుగా తెలిసింది. వివరాల్లోకి వెళితే.. సునీత అనే కరోనా బాధితురాలు చెన్నైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్లో చేరింది.
 
ఆ సెంటర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేస్తున్న రతీదేవి అనే మహిళ సునీతను హత్య చేసింది. గత నెల 23న జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితురాలిని పట్టుకున్నారు. సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం సునీతను రతీదేవి హత్య చేసింది.
 
చికిత్స పొందుతుండగా కూడా మెరుగైన ఆరోగ్యంతో భార్య సడెన్ గా చనిపోయిందని తెలిసిన సునీత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా రతీదేవి సునీత దగ్గర ఉన్న డబ్బులు, సెల్ ఫోన్ కోసం ఆమెను హత్య చేసిందని తేలింది. మే 23న జరిగిన ఈ హత్యను పోలీసులు ఛేధించారు.