సోమవారం, 11 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (19:38 IST)

తమిళనాడులో వర్ష బీభత్సం.. మహిళా పోలీస్ అదుర్స్

తమిళనాడులో వర్ష బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షం కారణంగా చెట్టు విరిగిపడి 8 ఏళ్ల యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా మహిళా పోలీస్‌ అధికారి ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వరి ఆమె భుజాలపై యువకుడిని మోసుకెళ్లి ఆటోలో ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. మహిళా పోలీస్‌ ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.
 
అలాగే గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి.
 
వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉంది.