1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 మార్చి 2021 (14:47 IST)

ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ కానిస్టేబుళ్లుగా 13మంది

Transgender
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మొత్తం 13మంది ట్రాన్స్‌జెండర్లను పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమించింది. కాగా, తమకు ఇది గొప్ప అవకాశమని ట్రాన్స్ జెండర్స్ చెబుతున్నారు. తమకు ఈ అవకాశం కల్పించిన ఛత్తీస్‌గఢ్ పోలీస్ డిపార్టుమెంట్‌కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. 
 
తమకు దక్కిన ఈ అద్భుత అవకాశం ద్వారా ప్రజలు తమ ట్రాన్స్‌జెండర్స్ కమ్యూనిటీని చూసే దృష్టి కోణం మారుతుందని భావిస్తున్నామని ఆ 13 మందిలో ఒకరైన సోనియా ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలో కర్ణాటక నుండి ఇలాంటి సంఘటన జరిగింది, రాష్ట్రం తన మొదటి లింగమార్పిడి మహిళను తన గ్రామ పంచాయతీకి అధిపతిగా ఎన్నుకుంది.