ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ట్యూషన్‌కు వెళుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికకు మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ముజఫర్ నగర్‌కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ బాలిక ట్యూషన్‌కు వెళుతుండగా నలుగు దండుగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆ బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారనికి పాల్పడ్డారు.
ట్యూషన్‌కు వెళ్లిన బాలిక ఇంటి నుంచి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక ప్రాంతాల్లో గాలించగా, ఒక నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను గుర్తించారు.
ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ మత్తు నుంచి కోలుకున్నాక విచారించగా అసలు విషయం వెల్లడించింద. దీంతో ఇద్దరు కామాంధులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు.