శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 18 నవంబరు 2020 (17:41 IST)

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్, కేంద్రానికి లేఖ రాసిన సీఎం కేజ్రీవాల్

ప్రపంచ వ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఉగ్ర తాండవం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కొనసాగడంతో పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో రాజధానిలో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
 
కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే పలు మార్కెట్లు, వివాహ కార్యక్రమాలు, దుకాణాలకు పలు నిబంధనలను విధించారు. ఢిల్లీలో వారం రోజులుగా 4 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో వీటిని అరికట్టేందుకు మరో లాక్‌డౌన్ ప్రకటించాలని సీంఎం అరవింద్ కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు.
 
ఇందుకోసం కేంద్రానికి లేఖ రాసి అనుమతి పొందిన తర్వాత హాట్‌స్పాట్ ప్రాంతాలకు లాక్ డౌన్ విధిస్తామని తెలిపారు. మంగళవారం వైద్య ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వ హించిన కేజ్రీవాల్ పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్షికంగా లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. దీనికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాసామని అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.