శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 నవంబరు 2017 (14:16 IST)

కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ కన్నుమూత

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మాజీమంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ సోమవారం కన్నుమూశారు. ఈయన వయసు 72 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు కృత్రిమశ్వాసపై జీవిస్తూ వ

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మాజీమంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ సోమవారం కన్నుమూశారు. ఈయన వయసు 72 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయనకు కృత్రిమశ్వాసపై జీవిస్తూ వచ్చారు. నిజానికి గత 2008లో ఆయన బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనకు పక్షవాతం సోకింది. అప్పటినుంచి ఆయనకు నోటిమాట నిలిచిపోయింది.
 
మెదడులో రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడుతుండటంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో వైద్యులు ప్రియరంజన్‌కు ప్రత్యామ్నాయమార్గాల ద్వారా శ్వాసనందిస్తూ వస్తున్నారు. శ్వాసక్రియ, రక్తపోటు వంటివి నియంత్రణలో ఉన్నప్పటికీ ప్రియరంజన్ దేహంలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు.