Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హిమాచల్‌ప్రదేశ్ బ్యాలెట్ సమరం : పోలింగ్‌కు సర్వం సిద్ధం

బుధవారం, 8 నవంబరు 2017 (09:31 IST)

Widgets Magazine
himachal poll

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాజకీయ పార్టీల ప్రచారం మంగళవారంతో ముగిసింది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకుగాను నవంబరు 9వ తేదీన పోలింగ్‌ జరుగనుంది. అన్ని స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేస్తున్నాయి. అలాగే, సీపీఎం 14 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుండగా, ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి 187మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌ - బీజేపీ పార్టీలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాయి. కాంగ్రెస్‌ అవినీతిని ఎండగడుతూ ప్రధాని మోడీ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ప్రచారంలో నోట్లరద్దు, జీఎస్టీలపై కేంద్రాన్ని టార్గెట్‌ చేశారు. గుజరాత్‌ మోడల్‌ విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ప్రేమ్ కుమార్ దుమాల్‌ను బీజేపీ ప్రకటిస్తే, కాంగ్రెస్ పార్టీ మాత్రం ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ పైనే గంపెడాశలు పెట్టుకుంది. 
 
పర్వత రాష్ట్రంలోని మొత్తం 68 నియోజకవర్గాల్లో బరిలో 338 అభ్యర్థులు నిలిచారు. వీరిలో మహిళలు 19 మందే ఉండటం గమనార్హం. మొత్తం 50.25 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరికోసం రాష్ట్ర వ్యాప్తంగా 7525 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మశాల నియోజకవర్గంలో అత్యధికంగా 12 మంది అభ్యర్థులు బరిలో నిలవగా అత్యల్పంగా ఝన్‌దుట ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానంలో ఇద్దరే పోటీలో ఉన్నారు. మొత్తం నియోజకవర్గాల్లో ఒకే విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు.
 
ఇకపోతే.. ఈ ఎన్నికల్లో బీజేపీకే విజయావకాశాలు మెండుగా ఉన్నట్టు సర్వేలు చెపుతున్నాయి. 2012లో కాంగ్రెస్‌ 42.8 శాతం ఓట్లు సాధించగా బీజేపీ 38.5శాతంతో గట్టిపోటీ ఇచ్చింది. 2007లో బీజేపీకి అధికారం దక్కినప్పుడు 43.8 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 38.9 శాతం దక్కడం గమనార్హం. ఇదే తరహాలో గడిచిన 8 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు సత్తా చాటుతున్నాయి. అయితే ఈ సారిదానికి విరుద్ధంగా బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

విమర్శలు.. పొగడ్తలు : పెద్ద నోట్ల రద్దుకు యేడాది

దేశంలో పెద్ద విలువ కలిగిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దుచేస్తున్నట్టు కేంద్ర ...

news

ప్యారడైజ్ పేపర్ల కథనాలపై జగన్ సమాధానం చెప్పాల్సిందే... మంత్రి కళావెంకట్రావు

అమరావతి: ప్యారడైజ్ పేపర్లలో జగన్ పైన వచ్చిన కథనాలపై తక్షణమే ఆయన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ...

news

సీనియర్ నరేష్ సంచలనం... పవన్ వస్తే ఎన్టీఆర్ పాలనే, కమల్ హాసన్ అయితే...

సీనియర్ నరేష్ సంచలన ట్వీట్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక పవన్ కళ్యాణ్ ...

news

పార్టీ ఎందుకు మారానా అని తల బాదుకుంటున్న ఎమ్మెల్యే..

వైసిపి నుంచి టిడిపిలోకి చేరారు 22 మంది ఎమ్మెల్యేలు. ప్రతిపక్ష పార్టీలో వుండి ఏమీ చేయలేమని ...

Widgets Magazine