మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (16:31 IST)

#SunandaPushkar కేసు.. శశిథరూర్‌కు నోటీసులు.. వేధింపుల వల్లే..?

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో 2014, జనవరి 17న సునందా పుష్కర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ నేత, సునంద పుష్కర్ భర్త శశిథరూర్‌కి పటియాలా హౌస్ కోర్టు మంగళవారం సమన్లు జా

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో 2014, జనవరి 17న సునందా పుష్కర్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ నేత, సునంద పుష్కర్ భర్త శశిథరూర్‌కి పటియాలా హౌస్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 7వ తేదీలోపు కోర్టుకు హాజరు కావాలని సునంద పుష్కర్‍‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
శశిథరూర్‌పై భార్యను తీవ్రంగా వేధించడం, ఆత్మహత్యకు ప్రేరేపించడం వంటి అభియోగాలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో శశిథరూర్‌ ఇంట్లో పనిచేసే నారాయణ్‌ సింగ్‌ను కీలక సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పోలీసులు ఈ కేసులో పలు కీలక విషయాలు తెలుసుకుని కోర్టుకి నివేదిక సమర్పించారు.
 
ఈ నివేదికలో తీవ్ర ఒత్తిడికి లోనైన సునంద పుష్కర్ ఆత్మహత్యకు పాల్పడిందని.. మృతికి వారం రోజుల ముందు భర్తకు ఆమె మెయిల్ పంపిందని తెలిపారు. తనకి బతకాలని లేదని, చనిపోవాలని ప్రార్థిస్తున్నానని అందులో ఉందని పోలీసులు నివేదిక ద్వారా కోర్టుకు తెలిపారు. సునంద పుష్కర్ శశిథరూర్‌కి పలుసార్లు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. 
 
ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడికి గురైన ఆమె విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని, అందుకు శశిథరూరే కారణమయ్యాడని పోలీసులు స్పష్టం చేశారు. సునంద పుష్కర్‌ పట్ల ఆయన క్రూరంగా వ్యవహరించేవారని, నాలుగున్నరేళ్ల కిందటి ఈ కేసులో ఆయన ఒక్కరే నిందితుడని 3000 పేజీల చార్జిషీట్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో శశిథరూర్‌ను నిందితుడిగా చేర్చే అంశంపై కోర్టు విచారణ జరపనుంది.