సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (09:55 IST)

కబాబ్ రుచిగా లేదని వంట మనిషి కాల్చివేత.. ఎక్కడ?

gunshot
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలిలో ఓ దారుణం జరిగింది. కబాబ్ రుచి నచ్చలేదని గొడవ పెట్టుకున్న ఇద్దరు వ్యక్తులు డబ్బులు చెల్లించమని అడిగినందుకు వంట మనిషిని కాల్చి చంపేశారు. ఈ దారుణంమ యూపీలోని బరేలీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
బరేలీలోని ప్రేమ్‌నగర్‌లో ఉన్న ఓ కబాబ్‌ దుకాణానికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. ఆ సమయంలో వారు మద్యం మత్తులో ఉన్నారు. కబాబ్‌ల రుచి నచ్చలేదని దుకాణ యజమాని అంకుర్‌ సబర్వాల్‌తో గొడవపెట్టుకున్నారు. 
 
ఈ క్రమంలో బిల్లు చెల్లించకుండానే వారు కారు వద్దకు వెళ్లారు. వారి దగ్గర రూ.120 వసూలు చేసుకురమ్మని నసీర్‌ అహ్మద్‌ అనే వంట మనిషిని అంకుర్‌ పంపించాడు. నసీర్‌ వారి వద్దకు వెళ్లగా వారిలో ఒకరు కోపంతో అతడి కణతపై తుపాకీతో కాల్చాడు. దాంతో నసీర్‌ ప్రాణాలు కోల్పోయాడు. నిందితులిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.