బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:55 IST)

శభాష్ అనిపించుకున్న పోలీస్ కానిస్టేబుల్.. ఏం చేశాడో తెలుసా? (video)

గుజరాత్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్‌ శభాష్ అనిపించుకున్నాడు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి నిత్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. 
 
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద బాధిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. అలా ఓ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ చోట ఇద్దరు చిన్నారులు భయాందోళనలో కనిపించారు. ఎటు చూసినా కనుచూపుమేర వరదనీళ్లే కనపడుతున్నాయి. ఒడ్డుకు చేరే పరిస్థితే లేదు.
 
ఇంకా తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పృథ్విరాజ్ సింగ్ జడేజా అనే పోలీస్ కానిస్టేబుల్ తన భుజాలపైకి ఎత్తుకుని గట్టుకు చేర్చారు. ఆ ఇద్దరు చిన్నారులను కింద పడకుండా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చిన ఘటనను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వారి నిబద్ధతను అంతా అభినందించండంటూ సీఎం విజయ్‌ రూపానీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి.