బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (21:48 IST)

తమిళనాడు, ముంబైలో కరోనా విలయతాండవం... ఒక్కరోజులోనే?

తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులోనే కొత్తగా 38 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇవాళ కరోనాతో ఇద్దరు చనిపోయారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ పేర్కొన్నారు. 
 
తమిళనాడులో ప్రస్తుతం మొత్తం 1242 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు. 118 మంది బాధితులు కరోనా వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఇప్పటివరకు కరోనా వల్ల 14 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
 
కరోనా మహమ్మారి ధాటికి ముంబై విలవిల్లాడుతోంది. బుధవారం ఒక్కరోజే ముంబైలో 183 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. దీంతో.. ముంబైలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1936కు చేరింది. ఒక్క ముంబై నగరంలోనే ఇప్పటివరకూ 113 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. కరోనాతో కోలుకుని 181 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.