శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2020 (09:31 IST)

కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ పొడగింపు : థియేటర్లు బంద్ - 7 నుంచి మెట్రోసేవలు

కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం గత మార్చి 23వ తేదీ నుంచి లక్డౌన్‌ను అమలు చేసింది. ఆ తర్వాత జూలై నెల నుంచి క్రమంగా లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఈ ఆంక్షల సడలింపులో భాగంగా అన్‌లాక్ 3.O ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అన్‌లాక్ 4.O ప్రారంభంకానుంది.

ఇందుకోసం కేంద్రం తాజాగా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. అన్ లాక్ 4.0 సడలింపులు, మార్గదర్శకాలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు ఆధారంగా అన్‌లాక్ 4.0 రూపొందించారు. ఈ మార్గదర్శకాలను ఓ సారి పరిశీలిస్తే, 
 
* సెప్టెంబరు 7 నుంచి మెట్రో సేవలు ప్రారంభం. మెట్రో సేవల నిర్వహణలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటించాల్సి ఉంటుంది. మెట్రో రైళ్లను దశలవారీగా నడపనున్నారు.
* సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టయిన్మెంట్ పార్కులు, థియేటర్లు సెప్టెంబరు 30 వరకు మూసివేత.
* సామాజిక, విద్యా, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన, రాజకీయ కార్యక్రమాలకు షరతులతో కూడిన అనుమతి. 100 మందితో కార్యక్రమాలు జరుపుకునేందుకు సమ్మతి. అయితే ఫేస్ మాస్కులు, భౌతికదూరం, థర్మల్ స్కానింగ్ ఏర్పాట్లు, శానిటైజర్/హ్యాండ్ వాష్ తప్పనిసరి.
 
* సెప్టెంబరు 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.
* సెప్టెంబరు 30 వరకు స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేత. 
* ఆన్‌లైన్/దూరవిద్య విధానంలో విద్యాబోధనకు ప్రోత్సాహం.
* సెప్టెంబరు 21 నుంచి.... రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు ఆన్‌లైన్ క్లాసులు, టెలి కౌన్సిలింగ్, ఇతర కార్యకలాపాల కోసం సగం మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను స్కూళ్లకు అనుమతించవచ్చు.
 
* కంటైన్మెంట్ జోన్ల వెలుపల 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చు. అది కూడా వారికిష్టమైతేనే. దీనికి వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నుంచి లిఖితపూర్వక అనుమతి ఉండాలి.
* ఐటీఐలు, ఇతర నైపుణ్య అభివృద్ధి సంస్థల్లో కార్యకలాపాలకు అనుమతి.
* సాంకేతిక, వృత్తిపరమైన విభాగాలకు చెందిన పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు ల్యాబ్ వర్క్ చేసుకునేందుకు అనుమతి.
* కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిన మేరకు మినహాయించి అన్ని అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు.
* ఓవరాల్‌గా కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబరు 30 వరకు లాక్‌డౌన్ అమలు.