మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (17:56 IST)

ఆన్‌లైన్ డేటింగ్- లక్షలాది రూపాయల మోసం.. పట్టేసిన పోలీసులు

ఆధునికత పెరిగిన కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో సుమా

ఆధునికత పెరిగిన కొద్దీ నేరాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.


వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్ డేటింగ్ పేరుతో సుమారు 150 మంది నుండి లక్షలాది రూపాయలను వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అందమైన అమ్మాయిలు, హీరోయిన్ల ఫోటోలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. 
 
ఈ వెబ్‌సైట్ ద్వారా డేటింగ్ కోసం ప్రయత్నించిన వారికి అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడించి.. డబ్బులు వసూలు చేశారు. దాదాపు 150 మంది బాధితులు ఆన్‌లైన్ డేటింగ్ ముఠా సభ్యుల బాధితులుగా తేలారని వెల్లడించారు. 
 
రూ.15లక్షల మేర నష్టపోయినట్లు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ కేసుకు సంబంధించి బాధితులు ఎవరైనా ఉంటే సమీప పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చని సజ్జనార్ చెప్పారు. బాధితుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.