శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:29 IST)

బావను ప్రేమించింది.. ఆత్మహత్య చేసుకుంది..

తన బావను ప్రేమించింది. కానీ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో బావా చాలా మంచోడని.. తానే తప్పు చేశానని తెలిపింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

తన బావను ప్రేమించింది. కానీ ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్‌లో బావా చాలా మంచోడని.. తానే తప్పు చేశానని తెలిపింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లికి చెందిన అనూష (18) బాసరలో పీయూసీ విద్యను అభ్యసిస్తోంది. 
 
ఆదివారం మధ్యాహ్నం తోటి అమ్మాయిలంతా భోజనానికి వెళ్లిన సమయంలో భవంతిపై నుంచి కిందకు దూకింది. తన బావతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనూషను, నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పక్కటెముకలు విరిగిన కారణంగా తీవ్రగాయాలతో మరణించింది. మరణానికి ముందు అనూష రాసిన సూసైడ్ లెటర్‌లో బావ వరసైన నాగరాజును ప్రేమించానని.. ఎందుకో మనస్పర్థలు వచ్చాయని చెప్పింది. 
 
బావ లేకుండా తాను బతకలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. బావ చాలా మంచోడని, తానే తప్పు చేశానని చెప్పింది. నాగరాజును ఏమీ అనవద్దని కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.