ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు
గులాబ్ తుఫాను నుంచి కోలుకోకముందే మరోముప్పు పొంచివుంది. గుజరాత్ రాష్ట్రంలోని ఉత్తర అరేబియా సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫానుకు షాహాన్ అనే పేరును ఖరారు చేశారు. ఇది శుక్రవారం ఉదయం ఉత్పన్నం కావొచ్చని ఐఎండీ వెల్లడించింది.
ఇదిలావుంటే గులాబ్ తుఫాను తీరం దాటినప్పటికీ ఆ ప్రభావం ఇంకా తొలగిపోలేదు. ఈ తుఫాను ప్రభావం కారణంగా ఈదురు గాలులు ఇంకా బలంగా వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు కోరుతున్నారు.