బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:23 IST)

లాటరీలో ఆటోడ్రైవర్‌కు రూ.12 కోట్ల బహుమతి..

బంపర్ లాటరీతో ఓ ఆటోడ్రైవర్ కోటీశ్వరుడైన కథ ఇది. ఈ ఘటన కేరళలోని కోచిలో చోటుచేసుకుంది. ఆదివారం ఓనం బంపర్‌ లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ ఫలితాల్లో టీఈ-645465 నంబరు టికెట్‌ బంపర్‌ బహుమతికి ఎంపిక అయింది. ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి కోచి సమీపంలో మర్నాడుకు చెందిన ఆటో డ్రైవర్‌ పిఆర్‌ జయపళన్‌ అని సోమవారం నిర్థారణ అయింది. 
 
ఈ బంపర్‌ లాటరీలో ఆటోడ్రైవర్‌కు రూ.12 కోట్ల బహుమతి దక్కింది. దీనిపై జయపళన్‌ స్పందిస్తూ... ''ఈ టికెట్‌ను సెప్టెంబరు 10న త్రిప్పునితురలో కొనుగోలు చేశాను. ఈ నంబర్‌కు బహుమతి లభిస్తుందని అప్పుడే భావించాను'' అని విలేకరులకు తెలిపారు. రూ.12 కోట్ల బహుమతి మొత్తంలో అన్నిరకాల పన్నులను మినహాయించగా రూ.7 కోట్లకుపైగా ఆయనకు దక్కుతాయి.