గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (18:02 IST)

అరేబియా, బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం-'హమూన్' తేజ్ వచ్చేస్తున్నాయ్!

cyclone
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం ఏర్పడనుంది. తీవ్ర వాయుగుండం తుఫానుగా మారితే 'హమూన్'గా నామకరణం చేస్తారు. తీవ్రవాయుగుండం దిశ మార్చుకుంది. ఉత్తర ఈశాన్య దిశగా సాగుతోంది. 
 
ఈ నెల 25 సాయంత్రం బంగ్లాదేశ్ ఖేపుపర - చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర వాయుగుండం మరింత బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. 
 
తుఫాను ప్రభావం ఏపీపై అంతగా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాలో రెండు మూడు రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడే ఈ వాయుగుండంతో హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఈ రెండు తుఫానులు, తేజ్, సైక్లోన్ హమూన్‌గా పేరుపెట్టుకోనున్నాయి. అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన తేజ్ తీవ్ర తుఫాను మరింత బలపడుతోంది. 
 
ఇది భారతదేశ తీరానికి దూరంగా కేంద్రీకృతమై ఉంది. యమెన్, ఒమన్ దేశాల వైపు అది కదులుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.