గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 10 డిశెంబరు 2019 (18:59 IST)

నన్ను ఢిల్లీ వాయు కాలుష్యం చంపేస్తుంది, ఇంకెందుకు ఉరి? సుప్రీంలో నిర్భయ దోషి

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు ఎన్ కౌంటర్‌లో చచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీ నిర్భయ కేసులో దోషులను ఇన్ని రోజుల పాటు జైల్లో జీవిస్తూ వుండటంపై దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనితో వారిని ఉరి తీయడం ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. డిసెంబరు 16వ తేదీన నిర్భయ దోషులను ఉరి తీస్తారంటూ ప్రచారం జరుగుతోంది. 
 
ఈ నేపధ్యంలో నిర్భయ దోషుల్లో ఒకడు సుప్రీంకోర్టుకు ఓ పిటీషన్ పెట్టుకున్నాడు. ఢిల్లీలోని గాలి పీలిస్తేనే చనిపోవడం ఖాయమనీ, ఢిల్లీ వాయు కాలుష్యానికి తమ ఆయుష్షు తగ్గిపోతుంది కనుక తమను ఉరి తీసే బదులు ఢిల్లీలో వదిలేస్తే ఆ గాలి పీల్చే చచ్చిపోతామనీ, కనుక తమను ఉరి తీయకుండా వదిలేయాలంటూ అతడు సుప్రీంకోర్టును వేడుకున్నాడు. నిర్భయ దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ ఈమేరకు పిటీషన్ పెట్టుకున్నాడు. 
 
ఇదిలావుంటే  నిర్భయ కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు దోషులను ఈ నెల డిసెంబర్ 16న ఉరి వేయబోతున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. అలాగే 14వ తేదీ లోగా ఉరి తాళ్లను సిద్ధం చేయాలంటూ బీహారులోని బక్సర్ జైలుకు ప్రిజన్ డైరెక్టరేట్ ఆదేశాలివ్వడంతో నిర్భయ దోషుల ఉరి ఖాయమనే అంటున్నారు.