ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2024 (10:20 IST)

గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మ నగలను కొట్టేశాడు.. ఐ ఫోన్ కొనేశాడు..

Love
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ యువకుడు దొంగగా మారాడు. బర్త్ డేకు గిఫ్ట్ కొనిపెట్టేందుకు ఇంట్లో అమ్మ నగలను చోరీ చేశాడు. ఈ విషయం తెలియక తన ఇంట్లో చోరీ జరిగిందంటూ ఆ కన్న తల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో కన్నకొడుకే నిందితుడని తెలిసి షాకైంది. 
 
ఈ ఘటన ఆగస్ట్ 3వ తేదీన న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. భర్త మరణించడంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడితో కలిసి నైరుతి ఢిల్లీలోని నజాఫ్‌గడ్‌లో ఆ తల్లి నివసిస్తుంది. అయితే ఆగస్ట్ 3వ తేదీన.. తన ఇంట్లో చెవి దిద్దులు, బంగారపు ఉంగరంతోపాటు రెండు చైన్లు కనిపించకుండా పోయాయి. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్మ నగలనే కొడుకు కొట్టేశాడని తేలింది. 
 
అమ్మ నగలను అమ్మి రూ.50 వేలతో ఆ యువకుడు ఐ ఫోన్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆపై అతనని అదుపులోకి తీసుకున్నారు. తొలుత ఈ చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించాడు. ఆ తర్వాత అసలు నిజం పోలీసులకు తెలిపారు. అతడి వద్ద ఐ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే చోరీ చేసిన గోల్డ్ రింగ్, రెండు నెక్లస్‌లు ఇద్దరు స్వర్ణకారులను వేర్వేరుగా విక్రయించినట్లు తెలిపాడు. దీంతో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.