వాయు కాలుష్యంపై కేంద్ర రాష్ట్రాలకు సుప్రీం డెడ్‌లైన్
రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వాలు ఎన్ని చెబుతున్నా కాలుష్యం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ చేయడం లేదన్న ఆలోచన వస్తోందని విచారణ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాన్ని ఇచ్చినట్టుగా కనిపించడం లేదన్నారు. పరిశ్రమలు, వాహనాలు ద్వారా వచ్చే కాలుష్యంపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, కఠిన కాలుష్య నియంత్రణ ప్రణాళికలు వెల్లడించాలని కోర్టు డెడ్‌లైన్ విధించింది.
అదేసమయంలో పాఠశాలలు తెరవడంతో కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్కూలు పిల్లలు మాత్రం పాఠశాలలకు వెళ్లాలి... పెద్దలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారని ఇది ఏమాత్రం సరిగా లేదన్నారు.