శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:19 IST)

దిల్లీ పీఠం దక్కేదెవరికి?

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు అధికారం చేపట్టేందుకు పూర్తి స్థాయిలో పోటీ పడుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అధికార ఆప్​ ప్రజలపై ఎన్నో వరాల జల్లులను కురిపించిన. మరి ఇవి ఫలించేనా?

ఈసారైనా భాజపా దిల్లీలో జెండా ఎగరేసేనా? దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని రాజకీయ పక్షాలూ పూర్తిస్థాయి శక్తియుక్తులతో సిద్ధమవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో దిల్లీలో భాజపా 57 శాతం ఓట్లతో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్నీ తన ఖాతాలో వేసుకొంది. దిల్లీలో అధికార పక్షమైన ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్‌) కేవలం 18 శాతం ఓట్లను మాత్రమే సాధించి, అయిదు చోట్ల మూడో స్థానంలో నిలిచింది.

అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా చూస్తే, భాజపా మొత్తం 70 స్థానాలకుగాను 65 సీట్లలో ఆధిక్యం కనబరచింది. కాంగ్రెస్‌ అయిదింటిలో ఆధిక్యం ప్రదర్శించగా, 'ఆప్‌' ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది.

ఈ లెక్కల ప్రకారం చూస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై భాజపాలో పూర్తిస్థాయి ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. కానీ, ఆ స్థాయి నమ్మకం 'ఆప్‌' శిబిరంలో కనిపిస్తోంది. అధికార ఆప్‌ను ఎదుర్కొనేందుకు భాజపా సతమతమవుతుండగా, కాంగ్రెస్‌ కూడా వెనుకంజలోనే ఉంది.