శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (17:28 IST)

పెద్ద నోట్లతో సెక్స్ వర్కర్లకు తప్పని తిప్పలు.. రెండు రోజుల్లో రూ.55లక్షలు డిపాజిట్ చేసిన సెక్స్ వర్కర్లు..

సెక్స్ వర్కర్లపై నోట్ల రద్దు ప్రభావం పడింది. రూ.500 రూ.1000 నోట్లు రద్దు చేయడం ద్వారా సెక్స్ వర్కర్ల బిజినెస్ పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. రెండు రోజులుగా రూ.500ల కంటే తక్కువ మొత్తాన్ని కస్టమర్ల ను

సెక్స్ వర్కర్లపై నోట్ల రద్దు ప్రభావం పడింది. రూ.500 రూ.1000 నోట్లు రద్దు చేయడం ద్వారా సెక్స్ వర్కర్ల బిజినెస్ పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. రెండు రోజులుగా రూ.500ల కంటే తక్కువ మొత్తాన్ని కస్టమర్ల నుంచి తీసుకుంటున్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సెక్స్ వర్కర్ల బిజినెస్ పడిపోగా, దక్షిణాసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా పేరొందిన సోనాగాచీలో సెక్స్ వర్కర్లు నోట్ల రద్దుతో నానా తంటాలు పడుతున్నారు. 
 
కస్టమర్ల నుంచి రూ.500 రూ.1000 నోట్లను తీసుకోవట్లేదని.. అందుకు బదులుగా రూ.300 రూ. 400లను తీసుకుంటున్నట్లు సెక్స్ వర్కర్లు జాతీయ మీడియాతో వెల్లడించారు. కస్టమర్ల వద్ద వంద రూపాయలు లేని పక్షంలో రూ.500 రూ.1000 లను సెక్స్ వర్కర్లు పుచ్చుకోవాల్సి వస్తుందని.. కస్టమర్లను కోల్పోయే అవకాశాలుండటంతో ఈ పని చేయాల్సి వస్తుందని దర్బార్ మహిళా సమన్వయ కమిటీ, సెక్స్ వర్కర్స్ ఆర్గనిజేషన్ వెల్లడించింది. 
 
 గత రెండు రోజుల్లో సోనాగాచీ సెక్స్ వర్కర్లు ఉషా బ్యాంకులో రూ.55లక్షలను డిపాజిట్ చేశారు. సాధారణ రోజుల్లో రోజుకీ సెక్స్ వర్కర్లు రూ.5లక్షల మేర డిపాజిట్ చేస్తారని ఉషా బ్యాంక్ అధికారులు తెలిపినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.