Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డేరా బాబా ఆ పని చేసేవాడు... శవాలను పాతిపెట్టి, మొక్కలు నాటేవాడు..

ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (05:50 IST)

Widgets Magazine

డేరా బాబాకు చెందిన నేరాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భక్తుల నమ్మకాన్ని బాగా వాడుకున్న డేరా బాబా వారిని చంపి అవయవాలను అమ్మేసేవాడని టాక్ వస్తోంది. ఈ విషయాన్ని బాబా మాజీ భక్తు డు గురుదాస్‌ తూర్‌ తెలిపాడు. ప్రైవేట్ వైద్య శాలలకు మృత దేహాలను విక్రయించే వాడని అతడు చెప్పాడు. లఖ్‌నవ్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు డేరా బాబా 14 మృతదేహాలను విక్రయించాడన్న ఆరోపణలపై హరియాణా సర్కారు శుక్రవారం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో అవయవాల కోసం హతమార్చిన వారిని డేరాలోనే పాతిపెట్టి... వారి శవాలపై గుర్తుకోసం మొక్కలు నాటేవారని తూర్ షాకింగ్ నిజాలను తెలిపాడు. 
 
డేరాలో చేరిన వెంటనే తమ అవయవాలను స్వచ్ఛందంగా దానం చేస్తామంటూ భక్తుల నుంచి స్వీయ ధ్రువీకరణలను తీసుకునేవారని, తర్వాత భక్తులను హతమార్చి వారి అవయవాలను అమ్ముకునేవారని గురుదాస్‌ తెలిపారు. హర్యానా, పంజాబ్‌ల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలకు మృత దేహాలను బాబా విక్రయించేవాడని గురుదాస్‌ చెప్పారు.ఇందులో వైద్యుల ప్రమేయం కూడా వుందని తూర్ చెప్పుకొచ్చాడు. 
 
డేరాను నమ్మి రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు... బాబా జైలు కెళ్లడంతో ఆత్మహత్య చేసుకున్నాడని గురుదాస్ తూర్ తెలిపాడు. హర్యానాలోని బల్‌కారా గ్రామానికి చెందిన సోంబిర్‌ కుమార్‌(47) డేరాబాబాకు చెందిన ఎంఎస్‌జీ రిసార్ట్స్‌లో రూ.3 కోట్లు పెట్టుబడి పెట్టాడు. దీని కోసం తన 32 ఎకరాలు అమ్మేశాడు. బాబా జైలుకెళ్లడంతో సోంబిర్ తన పెట్టుబడి వృధా అయ్యిందనే నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లేడీస్ హాస్టల్లోకి డేరా బాబా సొరంగ మార్గం... సంచుల్లో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు

డేరా బాబా అకృత్యాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి. డేరా బాబా ఆశ్రమం లోపలి నుంచి ఓ సొరంగ ...

news

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నారని కసాయిగా మారిన కన్నతల్లి(వీడియో)

కట్టుకున్న భర్తను కాదని మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక మహిళ ఆ విషయాన్ని ...

news

కిడ్నాప్ చేసి.. 29 రోజుల పాటు 15ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్: నదిలో ఈదుకుంటూ..?

అమెరికాలోని మినసోట్టా ప్రావిన్స్‌లో 15 ఏళ్ల బాలికపై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ...

news

స్టాలిన్‌కే సీఎం పదవి.. కమల్ హాసన్‌ Vs రజనీకాంత్.. లయోలా సర్వే

తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతికి అనంతరం అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ...

Widgets Magazine