అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి

jayalalithaa
Last Updated: ఆదివారం, 11 నవంబరు 2018 (09:48 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత జయలలితకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ అధికార అన్నాడీఎంకే మంత్రి, ఆ పార్టీ కోశాధికారి దిండుగల్ శ్రీనివాసన్ ఆరోపించారు. ఆయన శనివారం ఇదే అంశంపై మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు స్లో పాయిజన్‌ ఇవ్వడం వల్లే ఆమె చనిపోయారని సంచలన ఆరోపణలు చేశారు.

జయలలితను ఇంట్లో బందీగా ఉంచి మధుమేహం అధికమయ్యేలా స్లో పాయిజన్‌ ఇవ్వడంతో పాటు వేళాపాళా లేకుండా ఆహారం అందించారన్నారు. దీనికి కారణం శశికళ - టీటీవీ దినకర్ వర్గమేనని ఆరోపించారు. దినకరన్‌ తీరును గమనించిన జయ ఆయన్ని పదేళ్ల పాటు పార్టీ నుంచి తొలగించారని గుర్తు చేశారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో చేతులు కలిపి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్‌ పన్నిన కుట్రలు ఫలించబోవని మంత్రి శ్రీనివాసన్ జోస్యం చెప్పారు.
దీనిపై మరింత చదవండి :