గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 27 సెప్టెంబరు 2018 (10:24 IST)

అపోలోకు స్టాలిన్.. శస్త్రచికిత్స.. జరిగిందట...

డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ నూతన అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అపోలోలో అడ్మిట్ అయ్యారు. బుధవారం రాత్రి స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారని.. ఆప

డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేసే దిశగా సన్నాహాలు చేస్తున్న ఆ పార్టీ నూతన అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అపోలోలో అడ్మిట్ అయ్యారు. బుధవారం రాత్రి స్టాలిన్ అస్వస్థతకు గురయ్యారని.. ఆపై ఆయనను చెన్నైలోని అపోలోకి తరలించారు. కుడి తొడలో సమస్యగా మారిన తిత్తిని తొలగించడంలో భాగంగా ఆయనకు శస్త్రచికిత్స చేసినట్లు డీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
గత కొంతకాలంగా నడవటంలో స్టాలిన్ ఇబ్బందులు పడుతున్నారని.. బుధవారం ఒక్కసారిగా నొప్పి తీవ్రత అధికం కావడంతో.. స్టాలిన్‌ను ఆస్పత్రిలో చేర్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇకపోతే.. గురువారం మధ్యాహ్నానికి స్టాలిన్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. కాగా డీఎంకే మాజీ అధినేత, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మృతి చెందడంతో.. డీఎంకే కొత్త అధినేతగా గత మాసం స్టాలిన్ ఎంపికైన సంగతి తెలిసిందే.