గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:26 IST)

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా?

నవంబర్‌ నెలలో దీపావళి, గురునానక్‌ జయంతి పండుగల సందర్భంగా.. దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు 8 రోజుల సెలవులను అధికారులు ప్రకటించారు.

పబ్లిక్‌ హాలిడేలతోపాటు పండుగల నేపథ్యంలో.. బ్యాంకులకు 8 రోజులపాటు మూతపడనున్నాయి. నవంబరు నెలలో అయిదు ఆదివారాలు, రెండు శనివారాలు రావడంతో బ్యాంకులకు సెలవు అని, దీంతోపాటు దీపావళి, గురునానక్‌ జయంతి సందర్భంగా ఉన్న సెలవులను ప్రకటించారు.

నవంబరు నెలలో బ్యాంకులు 8 రోజులు మూతపడనున్నాయని, ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.